భాగ్యనగరంలో భారీ వర్షం…
భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరం రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
కొంచం వర్షం పడితే రోడ్లలో నీళ్లు చేరుకుంటాయి. అలాంటిది భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. ఇంతకముందే చెప్పినట్లు ఈ రోజు నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్ధిపేట, జనగామ, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.