బుల్లితెర పై అలరించనున్న సీనియర్ నటి
సీనియర్ హీరోయిన్స్ బుల్లితెర పై అలరించడం ఇప్పటికే మనం చాలామందిని చూశాం. అదే రూటులో సాగుతోంది నటి దేవయాని. ఒకప్పుడు తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు వారికి కూడా వెండితెరపై తన పాత్రలతో దగ్గరైన ట్రెడిషనల్ బ్యూటీ దేవయాని.
అయితే తాజాగా ఓ కొత్త సీరియల్ లో దర్శనం ఇవ్వనుంది దేవయాని. జీ తమిళ్ లో ప్రసారం కానున్న ‘పుదు పుదు అర్తంగళ్’ లో లక్ష్మీ పాత్రలో అలరించనుంది. సంప్రదాయబద్ధమైన లక్ష్మీ అనే గృహిణిగా దేవయాని ట్రైలర్ లో బాగా ఆకట్టుకుంటుంది. కాగా దేవయాని గతంలోనే బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. పలు సీరియల్స్, షోస్ చేస్తూ అభిమానుల్ని అలరించిన విషయం తెలిసిందే.