బిల్ గేట్స్ దంపతుల విడాకులపై కూతురు భావోద్వేగం…

తాజాగా బిల్ గేట్స్ దంపతులు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోబోతున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. అయితే వీరి విడాకులపై పద్ద కూతురు భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఏమన్నారు అంటే తన తల్లిదండ్రులు విడిపోతున్నారన్న విషయం అందరూ వినే ఉంటారు. ఇలాంటి గడ్డు పరిస్థితులను అస్సలు ఊహించలేదు. ఇలాంటి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, తన భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలో అస్సలు అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా తన కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ అమ్మానాన్నల విడాకులపై వ్యక్తిగతంగా తానేమీ స్పందించలేను అంటూ వాపోయారు. ఇంకా ఈ తరుణంలో మీరిచ్చే మద్దతు తనకెంతో ఊరట కలిగిస్తుంది అంటూ గేట్స్ దంపతుల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ ఓ రకమైన భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తన తల్లిదండ్రులు ఇకపై కలిసి ఉండరని, ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎలా అధిగమించాలో తనకు అస్సలు తెలియడం లేదని జెన్నిఫర్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *