బాలయ్య ప్రచారం అంటే… వేటు పడాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ముఖ్యంగా ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ టాప్ హీరో బాలకృష్ణ వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఆయనకు కోపం వచ్చిందంటే చాలు ఊగిపోతారు. అస్సలు ఆపుకోలేరు. పబ్లిక్లో ఉన్నా, ప్రైవేట్గా ఉన్నా.. ఆయన ప్రవర్తన ఒకేలా ఉంటుంది. కోపం వచ్చిందంటే.. అవతలి వ్యక్తికి ఒకటి తగిలించాల్సిందే. అంతేస్థాయిలో సహాయం చేయడంలో కూడా బాలకృష్ణ ముందుంటాడు.
అయితే బాలకృష్ణ ఇప్పటికే పలు సార్లు అతి చేసిన తన అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే తాజాగా హిందూపురంలో మరోసారి బాలయ్య చేయి చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో ఓ అభిమానిపై తన కోపాన్ని ప్రదర్శించారు బాలయ్య. 9వ వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్న సమయంలో.. అక్కడే ఉన్న అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. అది గమనించి కోపంతో ఊగిపోయిన బాలయ్య అతడిపై చేయి చేసుకున్నాడు. ఆ వీడియో, ఫొటోలను డిలీట్ చేయాలంటూ తన సిబ్బందిని ఆదేశించారు.
ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. దెబ్బలు తిన్న బాలయ్య అభిమాని ఓ వీడియో విడుదల చేశాడు. తాను బాలయ్యకు వీరాభిమానిని అని, విశ్రాంతి లేకుండా బాలయ్య బాబు ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. ఇంకా మా అన్న వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందని.. ఎవరో బయటి వ్యక్తి అనుకొని బాలయ్య తన పట్ల అలా ప్రవర్తించారని స్పష్టం చేశారు. తాను ఇలాంటి ఘటనలను పట్టించుకోనని కూడా వెల్లడించారు ఆ అభిమాని. కాగా ఈ ఘటనను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని.. తాను బాలయ్య వీరాభిమానిని.. అంటా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉదయం నుంచి బాలయ్య ఎవ్వరికీ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని, ఆ సమయంలో ఆయన తనను టచ్ చేసినందకు చాలా సంతోషంగా ఉందని సంతోషంతో ఆ అభిమాని చెప్పడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *