బర్త్ డే రోజు ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్…
సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన కాంట్రవర్సీకే మారుపేరు. అలాగే ఆయన తీసే సినిమాలు మాత్రమే కాకుండా పెట్టే ట్విట్స్ కూడా సంచలనంగా మారుతుంటాయి. అయితే ఈ విషయం ఆ విషయం అని పట్టించుకోకుండా అన్నింటి.. ఆయనకు నచ్చిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ఆయన దిట్ట. అలా మరొకరు చెప్పలేరు అనేది కూడా అంతే నిజం.
అయితే రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, గ్యాంగ్స్టర్లు, ఫ్యాక్షనిస్టుల పైనే సినిమాలు తీసాడు. ఎప్పుడూ వివాదాస్పదం, వ్యంగ్య కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి తనదైన శైలిలో తన పుట్టిన రోజు గురించి ఓ కామెంట్ పెట్టి ఫ్యాన్స్ ను హతాశులను చేశాడు. అదేమంటే… “ఇవాళ నా పుట్టిన రోజు కాదు.. వాస్తవానికి నా డెత్ డే… ఎందుకంటే నా ఆయుష్షులో ఒక ఏడాది తగ్గిపోయింది” అంటూ వర్మ ట్వీటాడు. అంతేకాకుండా ఏడుపు మొహం ఎమోజీని కూడా పోస్ట్ చేశాడు. దీంతో ఆర్జీవీ పోస్ట్ నెటిజెన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఆర్జీవీ నీ రూటే సెపరేటబ్బా.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఆర్జీవీ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.