ప్లాన్ ప్రకారమే నాపై ఆరోపణలు : ఈటల రాజేందర్
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పై గత రెండు రోజులుగా భూకబ్జాకు సంబంధించిన వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు, ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. అసలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తున్న కాలం. ఇలాంటి సమయంలో ఇటువంటి వ్యవహారం బయటపెట్టడం పట్ల సొంత పార్టీవారి హస్త ముమ్మాటికీ ఉంది అన్నది విశ్లేషకుల వాదన. ఈవ్యవహారంపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
ముఖ్యంగా మంత్రి ఈటల ఈ ఘటనపై ఏమన్నారంటే… తనకు ఆత్మగౌరవం కంటే పదవి గొప్పకాదని స్పష్టం చేసిన ఆయన తనపై భూ కబ్జా ఆరోపణలు ప్లాన్ ప్రకారం చేస్తున్నవే అని వెల్లడించారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడంతో సీఎం కేసీఆర్ విచారణకు కూడా ఆదేశించారు. ఇదే సమయంలో ఈటల మాట్లాడుతూ తాను ఎలాంటి విచారణకు అయినా సిద్ధమేనని స్పష్టం చేశారు. భూ కబ్జా ఆరోపణలు కట్టుకథలుగా కొట్టిపారేసిన ఆయన.. 20 ఏళ్లుగా ఈటల అంటే ఏంటో అందరికీ తెలుసని అన్నారు. తన ఆస్తులపై విచారణకు రెడీగా ఉన్నానని… సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరపించుకోవచ్చని వివరించారు. కాగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై ప్రచారం చేశారని.. అంతిమ విజయం ధర్మానిదే అని తెలిపారు.
అంతేకాకుడా 216లో ఒక హ్యాచరీ పెట్టాలని నిర్ణయించుకున్నామని, అత్యంత వెనుకబడిన అచ్చంపల్లిలో ఎకరా.. రూ.6లక్షల చొప్పున కొన్నామని అన్నారు. అలాగే 40, 50 ఎకరాలు కొన్నా అక్కడ కొన్నామని.. మళ్లీ 7 ఎకరాలు కొన్నామని.. కెనరా బ్యాంక్ ద్వారా రూ.వంద కోట్ల రుణం కూడా తీసుకుని హ్యాచరీ అభివృద్ధి చేశామని వివరించారు. ఆ హ్యాచరీ విస్తరించడం కోసమే భూములు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు ఈటల రాజేందర్.
అంతేకాకుండా తక్కువ ఖరీదు చేసే భూములు తీసుకున్నామని… ఈ విషయం సీఎం కేసీఆర్కు కూడా చెప్పామని అన్నారు. భూకబ్జా ఆరోపణలు అత్యంత నీచమైనది అని మండిపడ్డ ఆయన… తాను 1986లో హ్యాచరీలోకి అడుగుపెట్టానని.. తెలిపిన ఆయన తనకు ఈ వ్యాపారంలో మంచి అనుభవం ఉందని స్పష్టం చేశారు. కాగా తాను ఆత్మను అమ్ముకొనే వ్యక్తిని కాదని.. ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అయితే ఈ భూకబ్జా విషయంపై ఇప్పటికే విచారణ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టడంతో మరింత ఈఘటనపై ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొంది.