ప్రశాంత్ పంచుకున్న పాక్ జైలు ముచ్చట్లు….
ఓ తెలుగు యువకుడు తన ప్రేమ కోసం విదేశాలకు కాలినడకన నడిచి వెళ్లాడు. సరిహద్దుల్లో అక్కడ సైనికులకు దొరికిపోయి జైల్లో నాలుగేళ్ల పాటు మగ్గాడు. తాజాగా విడుదలైన ఆ అమర ప్రేమికుడు ప్రశాంత్ ఏం మాట్లాడుతున్నారో ఓ చుద్దాం.
తాను ప్రేమించిన అమ్మాయి కోసం ప్రశాంత్ అనే ఓ తెలుగు యువకుడు దేశాలు దాటి వెళ్లేందుకు కాలి నడకన బయలుదేరాడు. అక్కడ సరిహద్దుల్లో దాయాది దేశం సైనికులకు దొరికిపోయాడు. 2017 నుంచి పాక్ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఈ మధ్యనే విడుదల అయ్యాడు. హైదరాబాద్ చేరుకున్నాడు.
అయితే పాక్ చెర నుంచి క్షేమంగా బయటపడిన ప్రశాంత్ పాక్ జైలుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను తెలిపాడు. విచారణ సమయంలో తనను తీవ్రంగా కొట్టారని అతను తెలియజేశాడు. అలాగే ఎడారి ప్రాంతంలో సైనికులకు దొరికిన సమయంలో తనకు మంచి ఆహారం అందించారని కూడా ప్రశాంత్ పేర్కోన్నారు. అంతేకాకుండా రెండేళ్లు తనకు నకరం కనిపించిందని, రెండళ్ల తర్వాత పరిస్థితి కొంత మార్పు వచ్చిందని కూడా ప్రశాంత్ వివరించాడు. కాగా తన వలెనే ఎంతోమంది భారతీయులు పాక్ జైల్లో నరకం అనుభవిస్తున్నారని, ప్రభుత్వాలు వారిని విడుదల చేసే విధంగా చొరవ చూపాలని ప్రశాంత్ స్పష్టం చేయడం విశేషం.