ప్రభాస్ తో ఒకరోజు డేటింగ్ కు రెడీ : రష్మిక
టాలీవుడ్ లో అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణి రష్మిక. ‘చలో’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. 25 ఏళ్ల ఈ నటి స్టార్ హీరో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను పొందుతూ సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది. ఈ మధ్య బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఇక విషయానికి వస్తే ఈ మధ్య రష్మిక తన డేటింగ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను ఒక తెలుగు స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని అనుకుంటోందని తెలిపింది. అదీ ఎవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… నిజమే… ఈ విషయాన్ని స్వయంగా రష్మికనే చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తనకే గానీ అవకాశం వస్తే తప్పకుండా ఒకరోజు ప్రభాస్‌తో డేట్‌కు వెళ్తానని చెప్పి అందరికీ షాక్ కి గురిచేసింది. అసలు ఆమె ఏమన్నారంటే… తాను బాహుబలి నటుడికి విపరీతమైన అభిమానిని అని.. కూడా చెప్పింది రష్మిక. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో నటిస్తుంది రష్మిక. అలాగే బాలీవుడ్ సినిమా అయిన ‘మిషన్ మజ్ను’ లో కూడా రష్మిక నటించడం విశేషం.