పుష్పలో దిశాపటానీ చిందులు…

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో రాతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ తో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కి కరోనా సెకండ్ వేవ్ తో బ్రేక్ పడింది. అల్లుఅర్జున్ కూడా కరోనా బారిన పడినట్లుగా తాజాగా వెల్లడించారు. అయితే ఈ సినిమాలో అద్భుతమైన ఐటమ్ సాంగ్ ఉంది. అందులో బన్నీతో కలసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశాపటాని డ్యాన్స్ వేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని దిశానే బట్టబయలు చేసింది. ఇంటర్ నేషన్ డాన్స్ డే సందర్భంగా మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన దిశా బన్నీతో కలసి చిందేయబోతున్నట్లు తెలిపింది. ఈ మధ్య సల్మాన్ తో కలిసి ‘రాదే’లో సీటీమార్ సాంగ్ లో స్టెప్పేసిన దిశాపటాని త్వరలో బన్నీతో కలిసి ఆడనుందన్న మాట. అయితే బాలీవుడ్ సినిమాలో సల్మాన్ డాన్స్ విమర్శలపాలైనా… దిశాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ‘సీటీమార్’ ఒరిజినల్ లో అల్లు అర్జున్ డాన్స్ చూసి ఫిదా అయిపోయానన్న దిశాపటానీ… బన్నీ, హృతిక్ తనకు నచ్చిన హీరోలంటూ వెల్లడించింది. కాగా బన్నీ మూమెంట్స్ మామూలుగా ఉండవని గతేడాది వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ‘బుట్టబొమ్మ’ పాట కూడా తనకెంతగానో నచ్చిందని స్పష్టం చేసింది దిశా. ఇప్పటికే ‘సీటీమార్’కి నృత్యం చేయటం ఓ అద్భుతం అయితే తనతో కలసి ‘పుష్ప’ సినిమాలో స్టెప్పేయబోవటం మహాద్భుతంగా అభివర్ణించింది దిశా. కాగా బన్నీ, దిశా కలసి ‘పుష్ప’ స్టెప్పులతో ఎలాంటి మాయ చేయనున్నారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *