పవన్ కు నో చెప్పిన సాయిపల్లవి.. ?
టాలీవుడ్ లో ఫిదా సినిమాతో తెలుగమ్మాయిగా ఒదిగిపోయిన కుట్టిపాప సాయిపల్లవి. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అందం, అభినయంతో అమ్మడు అందరి మనసులు దోచుకుంది. దీంతో సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ హల్ చల్ చేస్తుంది. అదేమంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కోసం సంప్రదించారంట. కానీ సాయిపల్లవి ఈ సినిమాకి నో చెప్పారని వార్తలు తెగ బయటకు వస్తున్నాయి.
అయితే సాయిపల్లవి ఆ సినిమాకు నో చెప్పడానికి గల కారణాలు లేకపోలేదని తెలుస్తుంది. అదేమంటే కొందరు సాయి పల్లవి డేట్స్ ఖాళీ లేకపోవడం కారణం అంటుండగా.. మరి కొందరు సినిమాలో తన పోర్షన్ తక్కువగా ఉన్నందుకే సాయి పల్లవి సినిమాని రిజెక్ట్ చేసిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ పాత్రకు తగిన భార్య పాత్ర కోసం మూవీ మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించారు. అయితే అమ్మడు ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని తెరకెక్కిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది. అంతటితో ఆగకుండా మరికొన్ని సినిమాల్లో కూడా సాయిపల్లవి నటిస్తూ తీరిక లేకుండా గడుపుతుంది. ఏది ఏమైననప్పటికీ అయ్యప్పనుమ్ కోషియం సినిమాకి నో చెప్పడంపై సాయి పల్లవి క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది.