పర్యాటకులకు బ్యాడ్ న్యూస్… డార్విన్ ఆర్చ్ కుప్పకూలింది…
సౌత్ పసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పంలో పర్యాటకులను బాగా ఆకర్షించే ప్రసిద్ధ పర్యాటక కట్టడం కూలిపోయింది. గాలాపోగోస్ ద్వీపంలో సహజసిద్ధ రాతి కట్టడం డార్విన్ ఆర్చ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఈక్వెడార్ పర్యాటక శాఖ అధికారికంగా ప్రకటించింది. సహజ సిద్ధ శిలా తోరణం ప్రస్తుతం రెండు స్తంభాలుగా మారి బోసిపోయినట్లుగా దర్శనమిస్తుంది.
అయితే ఒకప్పుడు ఈ డార్విన్ ద్వీపంలో ఈ కట్టడం పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ కట్టడం నీటిలోకి చేరిపోయింది. సముద్రపు నీటి మధ్యలో ఈ ఆర్చ్ అద్భుతంగా చూపరులకు దర్శనమిచ్చేది. ఈ కట్టడానికి జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్ డార్విన్ పేరు మీదుగా డార్విన్ ఆర్చ్ అని పేరు పెట్టారు. ప్రపంచ వారసత్వ సంపద లిస్ట్ లో కూడా యునెస్కో చోటు కల్పించడం విశేషం. ఇలాంటి డార్విన్ ఆర్చ్ కూలిపోయిందని ఈక్వెడార్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.