పరువు నష్టం దావా… ఆ మాజీ ప్రధానికి రూ.2కోట్ల జరిమానా..

భారత మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు ఓ కేసులో ఏకంగా రూ.2 కోట్లు జరిమానా విధించింది బెంగుళూరు కోర్టు. అది పదేళ్ల నాటి కేసు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్ను వెంటాడింది. పదేళ్ల నాటి పరువు నష్టం దావా కేసులో కర్ణాటక మాజీ సీఎం, మాజీ ప్రధాని దేవెగౌడ్కు ఏకంగా రూ. 2 కోట్లు జరిమానా విధించింది బెంగళూరు కోర్టు.
అయితే 2011 జూన్ 28వ తేదీన ఓ టీవీ ఛానల్లో దేవెగౌడ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ జరిగింది. ఈ సందర్భంగా నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్(ఎన్ఐసీఈ) ప్రాజెక్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని దేవెగౌడ. ఆ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న కంపెనీ ప్రతినిధులు.. కోర్టును ఆశ్రయించారు. దేవెగౌడ వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం వాటిల్లింది అంటూ కోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సెషన్స్ కోర్టు.. ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసం కంపెనీ చేపట్టిన పెద్ద ప్రాజెక్టు అని తెలిపింది. అలాగే ఈ ప్రాజెక్టుపై పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతిస్తే ప్రజల కోసం చేపట్టిన ప్రాజెక్టు ఆలస్యమవుతుందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. కాగా సంబంధిత కంపెనీ పరువుకు భంగం కలిగించినందుకు గానూ ఎన్ఐసీఈకి దేవెగౌడ రూ. 2 కోట్లు చెల్లించాలని ఆదేశించింది బెంగళూరు సెషన్స్ కోర్టు. మొత్తానికి ఆ ఇంటర్వ్యూలో దేవేగౌడ చేసిన ప్రకటనతో తన ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని, రూ .10 కోట్ల నష్టం వాటిల్లిందని కంపెనీ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు చాలా కాలానికి జరిమానా విధించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *