పరిషత్ ఎన్నికలపై హైకోర్ట్ కీలక నిర్ణయం…
ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అవేమంటే.. రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ.. వాటిని పక్కన పెట్టిన ఎన్నికల కమిషన్ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేసింది.
అయితే ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వలేమని వెల్లడించింది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అలాగే ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఎస్ఈసికి నోటీసులు జారీ చేసింది.
అంతేకాకుండా ఎన్నికలపై మధ్యంత ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేమని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్నది ఎస్ఏఈసి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కోర్టు పేర్కొంటూ.. తర్వాత విచారణను ఈనెల 30కి వాయిదా వేయడం విశేషం.