పరిషత్ ఎన్నికలపై నిమ్మగడ్డ క్లారిటీ…

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ఎన్నికలను నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది.
అదేవిధంగా తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికల నిర్వాహణపై స్పష్టత ఇచ్చారు. పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వడం లేదని, మార్చి 31తో తన పదవీకాలం ముగియనున్న సందర్భంగా తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని వెల్లడించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన అందరికీ నిమ్మగడ్డ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఏకగ్రీవాలకు సంబంధించి సమస్యలను రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని నిమ్మగడ్డ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *