నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్ : పాక్ క్రికెటర్ భార్య
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా దాయాదిదేశమైన పాకిస్థాన్ లో కూడా ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. తాజాగా ఆ విషయం వెలుగుచూసింది. 2019 వన్డే ప్రపంచకప్ లో భాగంగా కోహ్లీని మాకిచ్చేయండి అంటూ పాక్ యువతి రిజ్లా రెహాన్ తెగ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎంతోమంది పాక్ అమ్మాయిలు.. బహిరంగంగా కోహ్లీకి లవ్ ప్రపోజ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఓ అమ్మాయి అయితే ఏకంగా స్టేడియంలోనే విరాట్ నన్ను పెళ్లి చేసుకుంటావా..? అంటూ ప్లకార్డ్‌ని కూడా పట్టుకొని దర్శనమివ్వడం అప్పట్లో వైరల్ గా మారింది. అయితే తాజాగా కోహ్లీ ఫ్యాన్స్ లిస్ట్ ఓ పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భార్య షామియా ఆర్జూ చేరింది.
అదేమంటే… తాజాగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఇలా అన్నారు. అసలు ప్రశ్న ఏమిటంటే.. ‘నీ ఫేవరెట్ బౌలర్ కచ్చితంగా హసన్ అలీనే కావచ్చు. మరి నీ ఫేవరెట్ బ్యాట్స్‌మెన్ ఎవరు..?’ అని నెటిజన్ అడిగాడు. అందుకు ఆమె వెంటనే టక్కున విరాట్ కోహ్లీ పేరు చెప్పేసింది. ఇదిలా ఉండగా… షామియా సొంతూరు భారత్‌లోని హర్యానా రాష్ట్రం. వాళ్ల ఫ్యామిలీ ప్రస్తుతం ఢిల్లీలో సెటిల్ అయింది కూడా. ఎమిరేట్ ఎయిర్‌లైన్స్‌లో ప్లైయిట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న షామియాని మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా హసన్ అలీ మూడేళ్ల క్రితం దుబాయ్‌లో కలిశాడు. కొన్ని రోజులు ఫ్రెండ్స్‌గా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత ప్రేమించుకొని, పెద్దల్ని ఒప్పించి 2019లో పెళ్లి చేసుకున్నారు. కాగా వీరికి అప్పట్లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులు దుబాయ్‌లో పార్టీ ఇవ్వడం పెద్ద చర్చకు దారితీసింది కూడాను.