నిర్మాతలతో ధనుష్… శేఖర్ కమ్ముల….
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ భారీ మూవీ ప్రకటన రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే గత నెలలో ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించగా… సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ నిర్వహించి విడుదల చేయనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, భారత్ నారంగ్, పి రామ్ మోహన్ లు హీరో ధనుష్ ను హైదరాబాద్ లో కలుసుకున్నారు.
అయితే ఈ మధ్యనే అమెరికాలో ‘గ్రే మ్యాన్’ షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇండియా తిరిగొచ్చాడు ధనుష్. అదేవిధంగా ఆయన డైరెక్ట్ గా తన సినిమా ‘D43’ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ సమయంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాను చేయబోయే సినిమా స్క్రిప్ట్ పై చర్చలు జరిపారు. అంతేకాకుండా ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం వివిధ భాషలకు చెందిన కొంతమంది ప్రతిభావంతులైన నటులతో, ప్రఖ్యాత సాంకేతిక బృందంతో చర్చలు జరుపుతోంది. కాగా ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. అలాగే ధనుష్ చివరిసారిగా ‘జగమే తందిరం’లో కనిపించాడు. హిందీ సినిమా అయిన ‘అత్రాంగి రే’ షూటింగ్ను కూడా ఆయన తాజాగా పూర్తి చేయడం విశేషం.