నిమ్మగడ్డది , చంద్రబాబుది ఒకే స్కూల్ : కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల్లోని నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై అమరావతి భూముల అవకతవకలపై సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో హైకోర్ట్ లో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన బాబు స్టే తెచ్చుకున్నారు. దీంతో ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై స్టేబాబు అంటూ విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా కొడాలి నాని మాట్లాడుతూ… జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి లోకేష్ అని ఆరోపించారు. ఇప్పుడు లోకేష్ ట్విట్టర్ లోకి వచ్చి నీ బాబు వల్లే కాలేదు నీ వల్లేం అవుతుందని లోకేష్ ట్విట్టర్ లోకి వచ్చి చెబుతున్నాడని, వైఎస్ దెబ్బ ఎలా ఉంటుందో 2004, 2009లోనే లోకేష్ బాబు రుచి చూశాడని, అప్పుడు లోకేష్ ఇంట్లో తిని పడుకుంటూ ఉండేవాడని వివరించారు. అలాగే ఇప్పుడు జగన్ దెబ్బ ఎలా ఉంటుందో తండ్రి, కొడుకులు రుచి చూశారని తీవ్రంగా విమర్శించారు.
అంతేకాకుండా చంద్రబాబుపై ఆరోపణలు వస్తే విచారణ కూడా చేయకూడదా? అని ప్రశ్నించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళకు దళిత రైతులు ఫిర్యాదు చేయడంతో ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారని అన్నారు. కోర్టులో చంద్రబాబుకు నాలుగు వారాల ఊరట మాత్రమే దొరికిందని, సీఐడీ విచారణ చేయకూడదని చంద్రబాబు, నారాయణ అభ్యర్థించిన అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. కాగా తండ్రీ కొడుకుల చేతిలో చావు దెబ్బతిని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ఇంకా ఏం పీకాలి వీళ్ళకు? అంటూ ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంకా నిమ్మగడ్డ, చంద్రబాబు ఒకే స్కూల్ అని… బ్రెయిన్ చెడిపోయిందని కొడాలి నాని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *