నిఘా నీడలో వాలంటీర్స్.. ఉల్లంఘిస్తే.. ఇక అంతే…

ఆంధ్రప్రదేశ్ పల్లెల్లోని పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నారు. అదే స్థాయిలో మున్సిపల్ ఎన్నికలను జరిపేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
అయితే సరికొత్తగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో దూసుకుపోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై కొంత నిఘా పెంచారు. తీవ్ర ఆంక్షలను విధించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇక నుంచి వాలంటీర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లు ఏమాత్రం ప్రచారంలో పాల్గొనకూడదని, ఓటర్ స్లిప్పుల పంపిణీ వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పార్టీలు, అభ్యర్థుల తరపున కూడా వాలెంటీర్లు ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే వాలంటీర్లు అస్సలు మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదని అన్నారు.
కాగా మున్సిపల్ ఎన్నికలకు వాలంటీర్లను దూరం పెట్టాలని, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలని కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు. అలాగే డేటా దుర్వినియోగం చేయకుండా.. వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని.. లబ్ధిదారుల డేటా దుర్వినియోగం కాకుండా చూడాలని వివరించారు. ఇక ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *