నాయిని అల్లుడు ఇంట్లో భారీ నగదు స్వాధీనం

తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ ప్రకంపణలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు పై ఈడీ గత కొన్ని రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్న విషయం కూడా విదితమే. తాజాగా దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించింది. 24 గంటల పాటు జరిపిన ఈ సోదాల్లో ఈడీ విలువైన వస్తువులు, డాకుమెంట్స్, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది.
అదేవిధంగా నగదుతో పాటుగా పెద్ద ఎత్తున బ్లాంక్ చెక్ లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈఎస్ఐ స్కామ్ లో శ్రీనివాస్ రెడ్డి, ముకుంద్ రెడ్డిలది కీలక పాత్రగా ఈడీ గుర్తించింది. ముకుంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు కలిసి మెడికల్ వైద్య పరికరాలను కొనుగోళ్లు చేయడంలో కీలక పాత్ర పోషించారని ఈడీ స్పష్టం చేస్తుంది. కాగా నిన్నటి నుంచి ఏడుగురి ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు మూడు కోట్ల పై చిలుకు నగదుతో పాటుగా కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు, ఆభరణాలు, ఆస్తుల పాత్రలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. రూ.200 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కామ్ లో మనీలాండరింగ్ హవాలా జరిగినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి కీలక పాత్ర ఉన్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *