నాగార్జున సాగర్ బీజేపీదే…

తెలంగాణలో అతి త్వరలో జరిగే ఉప ఎన్నిక నాగార్జున సాగర్. అయితే ఈ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు అన్ని పార్టీలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ కు బాగా పట్టున్న నియోజక వర్గం, ఆ తర్వాత టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా గెలుచుకొని అధికారాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ కు గట్టి పోటీగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ స్పష్టం చేశారు.

గెలిచేది బీజేపీ కాబట్టే.. తమ పార్టీలో టికెట్ కోసం ఎక్కువ పోటీ నెలకొని ఉందని వెల్లడించారు. టికెట్ తమకే రావాలని నాయకులు కోరుకోవడంలో తప్పులేదని.. టికెట్ ఎవరకి ఇచ్చినప్పటకీ.. వచ్చేది, గెలిచేసి బీజేపీనే అని ఆయన వివరించారు. టికెట్ ఎవరికి కేటాయించినా.. కలసి పనిచేసుకోవాలని సాగర్ నేతలకు ఆయన సూచించినట్లు వెల్లడించారు.


కాగా సాగర్ నాయకులతో సమీక్ష తర్వాత బీజేపీ గెలుపుపై మరింత నమ్మకం ఏర్పడిందని.. అక్కడి పరిస్థితులు తమకు చాలా అనుకూలంగా ఉన్నాయని నేతలు చెప్పినట్లు బండి సంజయ్ వివరించారు. దీంతో నాగార్జున సాగర్ లో బీజేపీ గెలుపు ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అబద్దాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని, పేదలు ఎప్పుడూ కూడా డబ్బులకు అమ్ముడు పోరని… దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో డబ్బులకు అమ్ముడు పోలేదని అన్నారు. అందుకు బీజేపీ గెలుపే మీకు సాక్ష్యమని అన్నారు. కేసీఆర్ వంటి నియంత, మూర్ఖత్వపు పాలనకు సమాధి పలుకుదామని బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *