నాకు కరోనా వచ్చిన మాట నిజమే

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు కరోనా సోకిందంటూ ఈ మధ్య వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై అల్లు అరవింద్ తాజాగా స్పందించారు. అయితే వార్తల్లో వచ్చినట్లుగా తనకు వాక్సిన్ రెండు డోసులు వేసుకున్న తర్వాత కరోనా రాలేదని స్పష్టం చేశారు. తొలి డోస్ వేసుకున్న తర్వాత ముగ్గురు మిత్రులతో కలిసి తాను ఊరు వెళ్ళానని, అందులో తనకు, మరో స్నేహితుడికి రెండు రోజుల పాటు కొద్దిపాటి జ్వరం వచ్చిందని, అయితే మూడో స్నేహితుడు మాత్రం హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని అల్లు అరవింద్ వెల్లడించారు.
అదేవిధంగా తాను, తన స్నేహితుడు వాక్సిన్ వేయించుకున్నామని, హాస్పిటల్ లో చేరిన స్నేహితుడు వాక్సిన్ వేయించుకోలేదని అరవింద్ తెలిపారు. వాక్సిన్ వేయించుకున్న కారణంగానే తామిద్దరం జ్వరంతో బయటపడ్డామని, కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకుంటే మంచిదని అల్లు అరవింద్ అన్నారు. కాగా వాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా వస్తుంది అని భావించేవారికి తన ఘటనే ఉదాహరణగా తీసుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకున్న వారికపై కరోనా ప్రభావం పెద్దగా ఉందడని, వచ్చి వెళ్ళిపోతుందని అల్లు అరవింద్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *