నగర శివార్లలో రేవ్ పార్టీ.. 90 మంది యువత అడ్డంగా…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీల హడావుడి విచ్చలవిడిగా సాగుతూనే ఉంది. తాజాగా అలాంటి పార్టీలో మునిగిన యువతపై దాడి చేసి భగ్నం చేశారు ఎస్వోటీ పోలీసులు. అయితే ఆ ప్రాంతంలోని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్లో జరుగుతోన్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి పెద్ద సంఖ్యలో అమ్మాయిలు, అబ్బాయిలను అరెస్ట్ చేశారు.
అయితే అక్కడ మొత్తం రేవ్ పార్టీ నడుపుతున్న 90 మంది యువకులని రాచకొండ పోలీస్ కమిషనరేట్కు చెందిన ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 90 మందిలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది. చాలా కాలంగా సంస్థాన్ నారాయణపురంలోని ఒక రిసార్ట్లో గుట్టుగా రేవ్ పార్టీ నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఆ ప్రాంతం వారు ఇచ్చిన సమాచారంతో రేవ్ పార్టీని రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా నిర్వాహకులతో పాటు యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరంతా ఎక్కడ నుంచి వచ్చారు. ఎప్పటి నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగుస్తున్నారు అనే విషయంపా విచారణ సాగిస్తున్నారు.
అంతేకాకుండా పోలీసుల దాడి సమయంలో మరో పది మంది యువకులు పరారైనట్లుగా తెలుస్తోంది. అ పరారీలో ఉన్న యువకుల్ని పట్టుకొనేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పట్టుబడిన 90 మంది యువకులతో పాటు యువతులను కూడా విచారిస్తున్నారు రాచకొండ పోలీసులు. కాగా ఆ రేవ్ పార్టీలో పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే 60 బైకులు, 20 కార్లు సీజ్ చేశారు. విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయో చూడాలి.