దేశాన్నే ఆకర్షించేలా తెలంగాణ సచివాలయం
తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. పాత సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ తోడ్పాటుతో ఈ సచివాలయ నిర్మాణం జరుగుతుంది.
అయితే ఈరోజు సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. దేశాన్నే ఆకర్షించేలా కొత్త సచివాలయ నిర్మాణం ఉంటుందని తెలిపారు. అలాగే తెలంగాణ ఆత్మగౌరవం ఇనుమడింపజేసేలా సచివాలయం ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు, సందర్శకులను ఆహ్లదపరిచే విధంగా సచివాలయం ఉండబోతున్నట్టు వివరించారు. పార్లమెంట్ మాదిరిగానే ధోల్ పూర్ స్టోన్స్ తో ఫౌంటైన్ల నిర్మాణం ఉంటుందని వెల్లడించారు. కాగా సచివాలయ నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి తెప్పించిన రాళ్లను సీఎం కేసీఆర్ ఈరోజు పరిశీలించారు. పిల్లర్లు, బీమ్ ల నాణ్యతను పరిశీలించడం విశేషం.