దేవకన్యలా తమన్నా భాటియా….!
సౌత్ ఇండియన్ స్టార్ హీపోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా షేర్ చేసిన తాజా పిక్స్ కు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా తమన్నా తన అత్యద్భుతమైన ఫ్యాషన్ తో నెటిజన్లను అలరిస్తుంది. మాస్టర్ చెఫ్ తెలుగు షూటింగ్లో బిజీగా ఉన్న ఈ స్టన్నింగ్ బ్యూటీ డాలీ జె రూపకల్పన చేసిన అద్భుతమైన డ్రెస్ లో దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జపనీస్ కట్-డానాతో హైలైట్ చేయబడిన ఐవరీ టల్లే సీక్విన్డ్ డ్రాప్డ్ గౌనులో తమన్నాను చూసిన నెటిజన్లు దేవకన్యలా ఉందంటూ కామెంట్స్ గుప్పిస్తుండటం విశేషం. అయితే తమన్నా భాటియా ఓపెన్ సాఫ్ట్ కర్ల్స్, పింక్ ఐ-షాడో, రోజీ బుగ్గలు, నేచురల్ లిప్ కలర్ మేకప్ లో పర్ఫెక్ట్ లుక్ తో ఆకర్షిస్తుంది.
అయితే సౌతిండియాలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ లలో తమన్నా ఒకరుగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగులో ‘మాస్ట్రో’ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. అంతాకాకుండా ‘ఎఫ్ 2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్ 3’ షూటింగ్ లో పాల్గొంటోంది తమన్నా. అలాగే సత్యదేవ్ తో ‘గుర్తుందా శీతాకాలం’ అనే తెలుగు సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా దినేష్ విజన్ వెబ్ సిరీస్ ‘యారి దోస్తీ’లో కూడా మెరవనుంది. ఈ వెబ్ సిరీస్ 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోల్ లో దర్శనమివ్వనుంది. మొత్తానికి చూసుకుంటే తాజాగా షేక్ చేసిన తమన్నా పిక్ మాత్రం దేవకన్యలా నెట్టింటిని ఓ ఊపు ఊపుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.