తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ రీఓపన్…!
కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లల్లాడిపోయింది. దేశంలో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో ప్రాణాలు రాలిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే వెలుపలికి వస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ పరిమితులను కూడా పూర్తిగా ఎత్తేశాయి ఆయా ప్రభుత్వాలు. ఇక లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా వేసుకున్న ఎన్నో సినిమాల నిర్మాతలు థియేటర్ల రీఓపెన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో తిరిగి ఓపెన్ అయితే విడుదలవ్వడానికి పలు భారీ సినిమాలు రెడీగా ఉన్నాయి.
అదేవిధంగా తాజా సమాచారం ప్రకారం జూలై 8 నుంచి థియేటర్లను ఓపెన్ చేయడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కానీ… ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో తెరుచుకోనుండగా, తెలంగాణలో మాత్రం థియేటర్లను 100% ఆక్యుపెన్సీతో తిరిగి ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే పలువురు స్టార్స్ సినిమా షూటింగులను కూడా స్టార్ట్ చేశారు. కాగా ఈ మహమ్మారి కారణంగా ఎంతమంది థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తారనేది ఉత్కంఠగా మారింది.