తెలుగు తేజం… స్పోర్ట్స్ వర్సిటీ వీసీగా కరణం మల్లేశ్వరి….

ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, తెలుగు తేజం పద్మశ్రీ కరణం మల్లేశ్వరికి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించింది ప్రభుత్వం. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని ఢిల్లీలో తొలిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఢిల్లీ సర్కార్. ఆ వర్సిటీ తొలి వీసీగా కరణం మల్లేశ్వరీకి అవకాశం దక్కడం విశేషం. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం.
అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయం నుంచి క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందే అవకాశం ఉంది. సిడ్నీలో 2000 సమ్మర్ ఒలింపిక్స్లో 240 కేజీల బరువు ఎత్తి కొత్త శకాన్ని సృష్టించారు భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి. కాగా ఆమె భారత్కు కాంస్యపతకం సాధించి పెట్టారు. 1975 జూన్1వ తేదీన చిత్తూరు జిల్లాకు చెందిన తవణంపల్లి గ్రామంలో జన్మించారు మల్లేశ్వరి. కానీ.. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలసలో స్థిరపడ్డారు. ఇప్పుడు కరణం మల్లేశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్ వర్సిటీ తొలి వీసీగా బాధ్యతలు స్వీకరించి రికార్డులోకి ఎక్కడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *