తెలుగువారికోసం పార్లమెంట్ లో మాట్లాడతా : నవనీత్ కౌర్
సినీనటీ, మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ తెలుగు ప్రజలపై ఆసక్తకరమైన కామెంట్స్ చేశారు. తాజాగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు అయిన రెండు సంవత్సరాలు తర్వాత తనపై కోర్టులో కేసు వేశారని… నవనీత్ కౌర్ మండిపడ్డారు. తనపై కేసు వేసింది… తనపై ఓడిపోయిన శివసేనా అభ్యర్థేనంటూ ఆమె తెలిపారు. ఐదు సార్లు ఎంపీగా ఎన్నికై… కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి తనపై రాజకీయ కుట్రలు చేస్తూన్నారని ఆమె విరుచుకు పడ్డారు. తాను ప్రజలకు సేవ చెయ్యడానికే రాజకీయాల్లోకి వచ్చానని… హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించానని ఆమె స్పష్టం చేశారు.
అదేవిధంగా ఇంకా ఆమె మాట్లాడుతూ తనకు ఇంతగా గుర్తింపు లభించింది తెలుగు ప్రజల వల్లనేనని.. వారి కోసం పార్లమెంటులో మద్దతు తెలుపుతానని వివరించారు. అలాగే ఆంధ్రాలో రైతులు, యువత ఇబ్బందులు పడుతున్నారని.. వారికి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. కాగా.. తప్పుడు కుల ధృవీకరణ పత్రాల కేసులో నవనీత్ కౌర్ కు సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించిన విషయం తెలిసిందే.