తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తూ రాహుల్ ట్వీట్…

తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు పోటేత్తింది.
అదేవిధంగా ఓవైపు ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద, మరోవైపు భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద నీటితో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చిరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా నాయకులను ఎలెర్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *