తెలంగాణ గవర్నర్ తమిళసైకి ప్రతిష్టాత్మక అవార్డు

తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. తాజాగా పుదుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు చేపట్టి అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను చాలా సమర్థవంతంగా డీల్ చేశారు.
అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసైని ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు వరించింది. యూఎస్ కాంగ్రస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డా.తమిళిసై సౌందరరాజన్ ఎంపిక కావడం విశేషంగా చెప్పవచ్చు. కాగా గవర్నర్ తమిళసైతో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.
అదేవిధంగా ఈ అవార్డును 9వ వార్షిక కాంగ్రషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో తమిళ సై అందుకోనున్నారు. సమాజం హితం కోరి సొసైటీకి అత్యున్నత సేవలు అందించినందును గాను డా. తమిళిసై సౌందరరాజన్ను ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం వరించడం పట్ల పలువురు మేథావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *