తెలంగాణలో పొలిటికల్ హీట్… ఈటలతో కొండా, కోదండరామ్ కీలక భేటీ…
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. తాజాగా ఈటల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ బిజేపిలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరామ్ ఈటల నివాసంలో ఆయనతో సమావేశం అయ్యారు.
అదేవిధంగా వీరిద్దరు ఈటలతో భవిష్యత్తు రాజకీయ కార్యాచరణతో పాటు కొన్ని కీలక నిర్ణయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈటల బిజేపిలో చేరుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అమిత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా సీఎం కెసిఆర్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడగట్టే యోచనలో ఈటల, కోదండరాం ఉన్నట్లు సమాచారం. ఇలాంటి విపత్త సమయంలో కేసీఆర్ ఇబ్బందులు పెట్టడం సరికాదని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మా మధ్య ఎలాంటి రాజకీయ చర్చ సాగలేదని అన్నారు. అలాగే ఈటల కుటుంబాన్ని వేధించడం కేసీఆర్ మానుకోవాలని కోదండరాం అన్నారు.