తెలంగాణలో కరోనాకి ఏడాది పూర్తి….

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్ -19 కరోనా వేవ్స్ కు మొదలై ఏడాది అయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కరోనా కేసు నమోదై నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. మార్చి రెండో తేదీన తొలి కరోనా కేసు నమోదైంది. ఎన్నో కేసులు రికార్డుకావడం, ఒక దశలో కరోవా తీవ్రత విపరీతంగా పెరగడం వంటివి బీభత్సం సృష్టించింది. ఏడాదికి కరోనా కాస్త ఉపశమించి తక్కువగా నమోదైంది. అయితే దేశవ్యాప్తంగా మరోసారి కరోనా పంజా విసురుతుండటం కరోవా సెకండ్, థర్డ్ వేవ్ కావడంతో మళ్లీ ప్రపంచంలో ఒక ఆందోళన నెలకొంది. ఏడాది కాలంగా మహమ్మారి తెలంగాణలో 1643 మందిని బలితీసుకుంది. ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపరచింది. అయితే జీవన విధానంలో మార్పులు, జాగ్రత్తలతో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం ఆనందించాల్సిన విషయంగా చెప్పవచ్చు. కానీ రిలాక్స్ అవుతున్న సమయంలో బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటం విశేషం.
అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏడాది పొడవునా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా సరికొత్త పాఠాలు నేర్పింది. ఎన్నడూ లేని విధంగా కొత్త అలవాట్లను సాధారణ జీవనంలో కచ్చితంగా ఆచరించేలా చేసింది. ముఖానికి మాస్క్ లేకుండా బయటకు రాకపోవడం అలవాటు చేసింది. ముఖ్యంగా శుభ్రతను అలవాటు చేసింది. గుంపు లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. గడిచిన ఏడాదిలో ప్రజలంతా వీటిని విధిగా పాటించారు. ఏడాది నాటికి తెలంగాణలో దాదాపు మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా గత మూడు నెలలుగా వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తూ వస్తుండటం ప్రజలను తిరిగి వారు వారి పనుల్లో పడవేసింది.
కాగా విదేశాలకు వెళ్లి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి 2020 మార్చి 2వ తేదీన తొలి కేసుగా నమోదు అయింది. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. ఇక మర్కజ్ ఉదంతంతో రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగాయి. తొలి కేసు నమోదు కాగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా ట్రీట్మెంట్ ను ప్రారంభించిది. అయితే ఇప్పుడు అందరిలో రెండో దశ టెన్షన్ మొదలౌతుంది. ఇప్పటికే కొత్త కేసులు రాష్ట్రంలో రావడంతో కాస్త ఆందోళన నెలకొనడం ప్రజలను కలవరానికి గురి చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *