తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదనకు ఈసీ తిరస్కరణ..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రారంభ కాలంలో ఆ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్దగా లేవు. మార్చి 10వ తేదీ నాటికి ఆ రాష్ట్రంలో 3110 యాక్టివ్ కేసులు మాత్రమే ఉండగా, ఏప్రిల్ 20 నాటికి 53 వేలకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఎన్నికల ప్రచారం కారణంగానే కేసులు పెరుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
అదేవిధంగా ఇప్పటి వరకు బెంగాల్ లో ఐదు విడతల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంకా మూడు విడతల ఎన్నికలు మిగిలే ఉన్నాయి. అయితే… ఈ మూడు విడతల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని, తద్వారా కరోనా వ్యాప్తిని కొంతమేరకైనా అడ్డుకోవచ్చునని తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదించింది. కాగా తృణమూల్ ప్రతిపాదనను ఈసీ తోసిపుచ్చింది. బెంగాల్ లో మిగిలిన మూడు విడతల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే యదాతథంగా జరుపుతామనని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.