తిరుమల ఆలయ అర్చకులకు జగన్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయ అర్చకులపై వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల ఆలయ అర్చకులపై ఏపీ ప్రభుత్వం కీలక జీవోను విడుదల చేసింది. మీ రాశి వంశికులు ఇష్టం మేరకు సంభావన అర్చకులను పే స్కేల్ విధానంలో కొనసాగే వెసలుబాటు కల్పిస్తూ జిఓ విడుదల చేసింది. పే స్కేల్ విధానంలో కొనసాగే మీరాశి అర్చకులు 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉండనుండగా… అటు తర్వాత వారి వంశం నుంచి మరొకరికి అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకోవడం విశేషం.
అదేవిధంగా సంభావన క్రింద కొనసాగే అర్చకులు ఆరోగ్యంగా ఉన్నంత వరకు కొనసాగి… ఆ తర్వాత వారి వంశంలో వారికి వెసులుబాటు కల్పించే అవకాశం వస్తుంది. పే-స్కేల్ విధానంలో కొనసాగే వారు… ఎప్పుడైనా సంభావన విధానంలోకి మారే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా మీ రాశి వంశికులలో మేజారిటీ అర్చకులు పే-స్కేల్ విధానం వైపు మొగ్గు చూపడంతో సర్వీసు రిజిష్టర్ ఒపెన్ చేసింది టీటీడీ. మీరాశి వంశికులు కోరిక మేరకు వారి కుమారులైన పది మందికి అర్చక వారసత్వం కల్పించింది టీటీడీ. తిరుపుతమ్మ వంశం నుంచి 6మందికి…. గొల్లపల్లి వంశం నుంచి నలుగురికి శ్రీవారి ఆలయ అర్చకులుగా అవకాశం కల్పించింది. కాగా రమణ దీక్షితులుతో సహా మరో ముగ్గురు మాత్రమే సంభావన అర్చకులుగా కొనసాగే అవకాశం ఉంది.