తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు వైఎస్ జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉపఎన్నికకు రసవత్తర ప్రచారం సాగుతుంది. తాజాగా తిరుపతి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖలు రాయడం సంచలనంగా మారింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆయన రాసిన లేఖల ప్రతులు పంపనున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లేఖలో జగన్ వివరించినట్టు సమాచారం అందుతుంది.
అయితే క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై జగన్ సంతకం చేశారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని లేఖలో జగన్ అభ్యర్ధించారు. సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను లేఖలో జగన్ ప్రస్తావించారు. ఈ లేఖలను లబ్ధిదారులకు వైసీపీ నేతలు అందించనున్నట్టు సమాచారం అందుతుంది. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈనెల 14వ తేదీన ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. తిరుపతిలో తాజా పరిణామాలతో జగన్ ప్రచారానికి రావాలని భావిస్తున్నట్లు సమాచారం. చూద్దాం జగన్ ప్రచారానికి వస్తే ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.