తమిళనాడులో డీఎంకే హవా.. ఉదయనిధి స్టాలిన్ కి డిప్యూటీ సీఎం…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 159 నియోజక వర్గాల్లో గెలిచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో డీఎంకే అద్భుతమైన విజయాన్ని సాధించింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి రానుంది. కరుణానిధి వారసుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే.. డీఎంకే విజయం వెనుక అనుసరించిన వ్యూహం, మ్యానిఫెస్టో రూపకల్పనే అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా డీఎంకే 505 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను రూపొందించింది. ఇందులో రేషన్ కార్డు దారులకు రూ.4 వేల రూపాయల సహాయం, పెట్రోల్, డీజీల్ పై రూ.5, రూ.4 రూపాయల తగ్గింపు, వంటగ్యాస్ సిలిండర్ పై రూ.100 రాయితీ, దేవాలయాల పునరుద్ధరణ కోసం వెయ్యి కోట్లు వంటి అంశాలు మ్యానిఫెస్టోలో స్టాలిన్ పేర్కొన్నారు. అంతేకాకుండా డీఎంకే హిందువులకు వ్యతిరేకం కాదని చెప్పేందుకు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పర్యటించి అక్కడి నుంచి అనేక ప్రసంగాలు చేశారు. ఇవన్నీ డీఎంకే విజయానికి దోహద పడ్డాయనే చెప్పాలి.
అయితే సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ 2021తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి బరిలోకి దిగాడు. డీఎంకే పార్టీ యూత్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ ఘన విజయం అందుకున్నారు. ఎన్నికల సంగ్రామం ప్రారంభమైనప్పటి నుంచే ఉదయనిధి మారన్ అందర్ని ఆకట్టుకొంటూ ప్రచారజోరును చేపట్టారు. ప్రత్యర్థి పార్టీ నేతలపైనే కాకుండా ప్రధాని నరేంద్రమోడీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ తన రాజకీయ ప్రసంగాలను చేశారు. ఇలాంటి సమయంలో ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎంను చేయాలని సోషల్ మీడియాలో ఆ పార్టీ అభిమానులు ప్రచారం హోరెత్తిస్తుండటం విశేషం.