తండ్రీ కొడుకు పై ఆ టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు…!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడిపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలో పర్యటించిన ఆయన.. నిన్న కత్తుల దాడిలో గాయపడిన కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ముఖ్యంగా వైసీపీ వర్గీయులు దాడులు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ.. ఎస్సైకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు.
అదేవిధంగా ఈ ఘటనపై కూన రవికుమార్.. మాట్లాడుతూ… గడచిన ఐదేళ్లలో ఆముదాలవలస నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎలాంటి గొడవలూ చోటు చేసుకోలేదని అన్నారు. ఇప్పుడు మాత్రం తమ్మినేని ఎవరిపై కేసులు పెట్టమంటే పోలీసులు వారిపై కేసులు పెడుతున్నారని తీవ్రమైన ఆరోపనలు చేశారు. అలాగే తమ్మినేని సీతారాం ఓ సిగ్గుమాలిన వ్యక్తి అంటూ మండిపడ్డ కూన రవికుమార్… గ్రామాల్లో పర్యటనలు గాడిదలు కాయడానికి చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మీకు చేతకాక ఊరకుక్కలతో మాట్లాడిస్తున్నావని… అబ్బాకొడుకుల సంగతి చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని.. తమ్మినేని, తమ్మినేని కొడుకు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *