ఢిల్లీలో బిజీ బిజీగా ఏపీ బీజేపీ….!
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు హస్తినకు వెళ్లారు. నెల రోజుల వ్యవధిలో వీర్రాజు అండ్ టీం ఇలా ఢిల్లీ వెళ్లడం రెండో సారి. అయితే ఈసారి పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఆర్థికశాఖ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు కూడాను. అందుకు సంబంధించి ఆమెకు వినతిపత్రం కూడా అందజేశారు. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రానికి నిధులు నిలుపదల చేయలేదని సోము వీర్రాజు తెలిపారు.
అదేవిధంగా కేంద్రాన్ని అనడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రికి, సజ్జలకు ఏ విధమైన నైతిక అర్హత లేదని కూడా వారు అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వలె తాము దిగజారి మాట్లాడలేమని సోము వీర్రాజు వివరించారు. అంతేకాకుండా పట్టణ గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిజీత్ సింగ్కు కూడా వినతి పత్రం అందజేశారు. ప్రధానాంగా రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై ఆయా శాఖలపై రివ్యూ చేయాలని కూడా బీజేపీ బృదం కోరడం జరిగింది. కాగా ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉన్న బీజేపీ నేతలు మరికొందరు కేంద్రమంత్రులతో పాటు పార్టీ పెద్దలను కూడా కలిసి తమ వినతిని వ్యక్తం చేయనున్నట్లు స్పష్టమౌతుంది.