డీఎంకే మ్యానిఫెస్టో రిలీజ్.. పెట్రో…గ్యాస్ ధరలు తగ్గిస్తాం…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం కోసం అన్నిపార్టీలు ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టి సారించారు. డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టోను ఈరోజు విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా పెట్రోల్, వంట గ్యాస్ ధరలను తగ్గిస్తామని చెప్పింది. పెట్రోల్ ధరలను ఐదు రూపాయల వరకు తగ్గిస్తామని డీఎంకే నేత స్టాలిన్ పేర్కొన్నారు. అదే విధంగా వంట గ్యాస్ పై రాయితీ ఇస్తామని వెల్లడించారు.
అంతేకాకుండా మహిళలకు 12 నెలల ప్రసూతి సెలవులు కల్పిస్తామని కూడా డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. మంత్రుల అవినీతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు ట్యాబ్ లు, తమిళనాడులో కలైంగర్ క్యాంటిన్లు, బియ్యం కార్డు దారులకు రూ.4 వేలు సహాయం, మధ్యాహ్న భోజన సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు, శాసనసభా సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం వంటి హామీలతో కూడిన మ్యానిఫెస్టోను డీఎంకే విడదల చేయడం విశేషం.