ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సిద్ధం….
సోషల్ మీడియాపై కేంద్రం వేటు వేస్తుందా? అంటే అందుకు రెడీ అయిందనే చెప్పాలి. ట్విట్టర్ పై చర్యలు తీసుకొనేందుకు కేంద్రం సిద్దం అవుతుంది. చాలా రోజుల క్రితం ట్విట్టర్ కు భారతప్రభుత్వం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ప్యానల్ సమన్లు జారీ చేసిన తర్వాత ట్విట్టర్ తాత్కలిక ఛీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించింది.
అదేవిధంగా తాము ఇచ్చిన గడువు లోపల ట్విట్టర్ చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించలేదని కేంద్రం వెల్లడించింది. అలాగే ట్విట్టర్పై చర్యలు తీసుకొనేందుకు సిద్దమౌతుంది. అధికారిని ఆలస్యంగా నియమించడంతో భారత్లో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా చట్టపరమైన రక్షణను కోల్పోవడంతో ట్వట్టర్పై చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధమైనట్లు వివరించింది.