ట్రంప్ కి మళ్లీ షాకిచ్చిన ఫేస్బుక్ …!

సంపన్న రాజ్యమైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరోసారి ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్స్లో అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ విజయాన్ని చట్టసభ్యులు ధ్రువీకరిస్తున్న సమయంలో కూడా ట్రంప్ అభిమానులు, ఆ భవనంపై దాడికి దిగడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటివి చోటుచేసుకున్నాయి.
అదేవిధంగా అందుకు కారణం ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టులే కారణమని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో.. ఆ పోస్టులను తొలగించడమే కాకుండా.. ట్రంప్ ఖాతాలపై బ్యాన్ విధించాయి సోషల్ మీడియా సంస్థలు. అయితే ఇప్పుడు ఆ బ్యాన్ను మళ్లీ పొడిగించింది ఫేస్బుక్. కనీసం 2023 వరకూ ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేస్తున్నట్టు ఫేస్బుక్ ప్రకటించింది. అంతేకాకుండా ఆయన చర్యలు మా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లే… కొత్తగా అమల్లోకి వచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం విధించే అత్యంత కఠినమైన శిక్ష ఆయనకు వేయాలని ఫేస్బుక్ పేర్కొనడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *