టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు కీలక వ్యవస్థను ప్రారంభించారు. దేవాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకచోటకి తెచ్చే టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ముఖ్యంగా టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టంలోకి దేవాదాయశాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాలు రానున్నాయి. ఈ వ్యవస్థను ప్రారంభ సమయంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేవాలయాల సమాచారం, ఆన్లైన్ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్బోర్డు, సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా టెంపుల్ మేనేజ్ మెంట్ వ్యవస్థలో ఉంటాయని స్పష్టం చేశారు.

అదేవిధంగా భక్తులు ఇ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే అవకాశం కూడా కల్పిస్తున్నామని అన్నారు. క్య-ఆర్ కోడ్ ద్వారా ఇ- హుండీకి కానుకలు సమర్పించే అవకాశం ఇస్తున్నామని కూడా తెలిపారు. ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అలాగే తొలిసారి అన్నవరం దేవాలయంలో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ మొదలు పెడతామని ఈ నెలాఖరు వరకు 11 ప్రధాన దేవాలయాలల్లో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ ప్రవేశ పెడతామని వివరించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అన్నవరం టెంపుల్కు 10,116లు ఇ-హుండీ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సమర్పించారు. కాగా దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని, దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలని జగన్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *