టీడీపీ మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్… అర్థరాత్రి హైడ్రామా…
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా.. బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని గత అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి అనుచరులపై దాడి చేసిన ఘటనలో జనార్దన్ రెడ్డితో పాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ అరెస్ట్ పై అక్కడ గత అర్ధరాత్రి 2 గంటలకు హైడ్రామా చోటుచేసుకుంది. అర్థరాత్రి 2గంటల సమయంలో జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. టీడీపీ కార్యకర్తల్లో భయాందోళనలు, సృష్టించేందుకే పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే అర్ధరాత్రి జనార్దన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పోలీసుల వాహనాలను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. చివరికి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి డోన్ పీఎస్ కు తరలించారు పోలీసులు. కాగా జనార్దన్ రెడ్డిపై IPC 307, 147, 148, 324, 341, 3 క్లాస్ 1, సెక్షన్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పోలీసులు నమోదు చేయడం విశేషం.