జస్ట్ 10 సెకన్స్ వీడియో రూ.48 కోట్లు
జస్ట్ పది సెకన్ల్ వీడియో క్లిప్పింగ్ అక్షరాలా రూ. 48.4 కోట్లకు అమ్ముడుపోయింది. అవాక్కయ్యారా. నిజం ఇది. అసలు అందులో స్పెషల్ ఏమిటి అంటారా అయితే చూద్దాం.
తాజాగా అమెరికాకు చెందిన ఆర్ట్ కలెక్టర్ పబ్లో రోడ్రిగ్యూజ్ ఫ్రైల్ గత సంవత్సరం ఓ వీడియోను రూపొందించాడు. కేవలం పది సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఆ వీడియో కోసం అతడు 67 వేల డాలర్లు ఖర్చు పెట్టాడు. భారత కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ.49.23 లక్షలు ఖర్చుపెట్టాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ వీడియో ఏకంగా 6.6 మిలియన్ డాలర్లకు అంటే 48.47 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కాగా ఈ వీడియో అంతలా అమ్ముడుపోవడానికి కారణం లేకపోలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేలపై చొక్కా లేకుండా పడుకున్నట్లుగా ఉండగా అతడి శరీరంపై పలు పదాలను రాసి ఉన్నాయి. జనాలు అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ పోతున్నారు. ఇది ఆసక్తిగా ఉండటంతో ఇది ఇంత ఖరీదు పలికి ఉంటుందని తెలుస్తోంది.