జలవివాదంపై రోజా ఆసక్తికర కామెంట్స్…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. అలాగే ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కూడా అదే విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల నేతలు జల వివాదంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుపుతున్నారు. వాటాల విషయంలో వివాదం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా.. జలవివాదంపై నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రెండురాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, కేంద్రం జోక్యం చేసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని రోజా తెలిపారు.
అదేవిధంగా చంద్రబాబు, లోకేష్, రేవంత్ రెడ్డీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు రోజా. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో రైతులను దగా చేశారని, బాబు, లోకేష్లు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. రైతుల కోసం రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపిన ఆమె.. తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం కోవర్టుగా కాంగ్రెస్లో పనిచేస్తున్నారని విమర్శచారు.