జనసేనాని, అమిత్ షా భేటీకి ముహూర్తం ఫిక్స్..
ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ముఖ్యంగా బీజేపీ, జనసేన మధ్య తీవ్రంగా సాగుతున్నాయి. కొన్ని విషయాల్లో ఈ ఇరు పార్టీల మధ్య పొత్తులపై స్పష్టత రాకపోవడంతో కేడర్ కి ఎటువైపు ఎలా ఉండాలో అంతుపట్టకుండా ఉంది. ఇక తాజాగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావడంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికపై దృష్టిసారించాయి.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించి మందకొడిగా ప్రచారాన్ని సాగిస్తున్నా.. వైసీపీ, జనసేన-బీజేపీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూస్తుంది. ఈనెల 4,5 తేదీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో ఈనెల 4వ తేదీ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తిరుపతిలో భేటీ కాబోతున్నారు. తిరుపతి అభ్యర్థి, తాజా రాజకీయ పరిణామాలపై పవన్ కళ్యాణ్ అమిత్ షాతో చర్చించబోతున్నట్లు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన జరిగినప్పటి నుంచీ ఆసక్తి రేపుతున్న అంశం. అలాగే… మార్చి 5వ తేదీన జనసేన, బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఆ సందర్భంగా తిరుపతి అభ్యర్థి ఏ పార్టీ నుంచి ఉంటారు అనే విషయంపై కాస్త స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.