చైనాకు శామ్సంగ్ షాక్… ఇండియాకి తరలింపు….
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్… చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అదేమంటే… చైనాలో నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను యూపీలోని నోయిడాకు షిఫ్ట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అందులో భాగంగానే శామ్సంగ్ సంస్థ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈఓ కెన్ కాంగ్ నేతృత్వంలోని శామ్సంగ్ ప్రతినిధి బృందం యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే మెరుగైన పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడిదారుల- స్నేహపూర్వక విధానాల సౌలభ్యం దృష్టిలో ఉంచుకొని తమ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శామ్సంగ్ సంస్థ ప్రతినిధి బృందం వెల్లడించింది. అదేవిధంగా దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం యోగి ఆదిత్య నాథ్… భవిష్యత్తులోనూ శామ్సంగ్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సాయం కొనసాగిస్తుందని ప్రతినిధి బృందానికి హామీ ఇవ్వడం విశేషం.