చిర వ్యాపారులకు ఆసరాగా జగనన్న తోడు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇస్తూ ప్రజలకు బ్రతుకు పట్ల్ ఓ భరోసాని కల్పిస్తున్నారు. ముందుగా ఈ కరోనా సమయంలో పేదలకు ఈ సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగుపడుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కరోనా సమయంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకొనేందుకు సీఎం… జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులను అదుకుంటూ ఉండటం ఎంతైనా విశేషంగా చెప్పవచ్చు.
అయితే చిరువ్యాపారులకు ఈ ఫథకం ద్వారా రూ.10వేల రూపాయల వడ్డీ లేని రుణాలను మంజూరు చేయబోతున్నారు. తాడెపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్ నగదును బదిలీ చేశారు. ఈ పథకం ద్వారా 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ది చేకూరతుంది. కాగా ఈ పథకం కోసం రూ.370 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించబోతుండటం ఎంతైనా విశేషం. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా ఈ పథకాన్ని అమలు చేశారు. అలాగే ఈ ఏడాది కూడా కరోనా సమయంలోనే ఈ పథకాన్ని అమలు చేస్తుండటం పట్ల చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.