చంద్రబాబు గుండెకాయ భయపడే రకం కాదు : లోకేష్

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఉపఎన్నికను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తీవ్రంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతిలో ప్రచారం జోరుగా సాగుతోంది. విజయమే లక్ష్యంగా అన్నీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే సోమవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. తిరుపతి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభపై రాళ్ళ దాడి జరిగింది. ఈ ఘటనపై నారా లోకేష్ చాలా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీపై నిప్పులు చెరిగారు. జగన్ ది ప్రిజనరీ బుద్ధి అంటూ ధ్వజమెత్తారు.
అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఇదే తిరుపతి కొండపైన స్మగ్లర్లు, తీవ్రవాదులతో కలిసి 24 క్లైమోర్ మైన్లు పెట్టి పేల్చితే సాక్షాత్తు ఏడుకొండలవాడే కాపాడిన ప్రాణం చంద్రబాబుది అంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ సమయంలో ఓ ఒక్కరూ బతికే అవకాశంలేని దాడి నుంచి తేరుకుని సహచరులు ఎలా ఉన్నారని ముందు అడిగి తెలుసుకున్న గుండె ధైర్యం చంద్రబాబుది అంటూ వెల్లడించారు. అంతేకానీ నీలాంటి ఫ్యాక్షన్ కుక్కమూతిపిందెలు వేసే రాళ్లు ఆయనని భయపెట్టలేవు. జగన్ నీ ప్రిజనరీ బుద్ధితో రాళ్లేయిస్తే, అదే రాళ్లతో జనానికి పనికొచ్చే ఒక నిర్మాణం చేయించగల విజనరీ చంద్రబాబు అంటూ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో నా సవాల్ కి తోకముడిచి తొలి ఓటమిని అంగీకరించావ్, అలాగే చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని ఓర్వలేక నీ రౌడీమూకలతో రాళ్ల దాడి చేసి రెండో ఓటమిని ఒప్పుకున్నావు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు లోకేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *