చంద్రబాబుపై గుంటూరులో మరో కేసు…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా చాలా తీవ్రంగా విరుచుకు పడుతుంది. రోజుకి 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉంటే… తాజాగా గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో పోలీస్ కేసు నమోదైంది. టూరు జిల్లాలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
అయితే రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్ ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భయబ్రాంతులకు చేస్తున్నారంటూ న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా పట్ల ప్రజలు భయపడేలా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడారని అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ మధ్యనే కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడిపై ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *