గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం… 14మంది మృతి

దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా సోకిన వారికి వైద్యం అందించేందుకు హాస్పిటల్స్ కూడా సరిపోవడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అటు కోవిడ్ ఆస్పత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్ర కలవరానికి గురిచేస్తుంది.
తాజాగా గుజరాత్ లో మరో కోవిడ్ ఆస్పత్రిలో ఘోర ఆగ్ని ప్రమాదం సంభవించింది. భరూచ్ నగరంలోని వెల్ఫేర్ కోవిడ్ రోగుల ఆస్పత్రిలో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 14 మంది మృతి చెందారు. వెల్ఫేర్ ఆస్పత్రిలో మంటలు చెలరేగగానే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి 50 మందికి పైగా కరోనా రోగులను రక్షించగలిగారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఇప్పటికే 14 మంది మృతి చెందారని, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భరూచ్ జిల్లా ఎస్పీ రాజేంద్ర సింహ్ చుదాసహ పేర్కొన్నారు. కాగా ఆస్పత్రి ఐసీయూ వార్డులో ఆక్సిజన్ సిలిండర్ లీకై ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. మరి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *